ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ కన్నుమూశారు.

0
223

కొంత కాలంగా శ్వాసకోశవ్యాధితో బాధపడుతున్నప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ… హైదరాబాద్ లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కోడి రామకృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమ షాక్ కి గురైంది. పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా సినిమాలు తీసిన ప్రేక్షకుల్ని మెప్పించారు. ఒక వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఇంకో పక్క కుటుంబ కథా చిత్రాలు కూడా తెరకెక్కించేవారు. దాదాపు స్టార్ హీరోలందరితోనూ చేసిన అతి కొంతమంది దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. ‘అమ్మోరు’, ‘దేవి’, ‘దేవీపుత్రుడు’, ‘అంజి’, ‘అరుంధతి’ గ్రాఫిక్స్ ఓరియంటెడ్ సినిమా లు తీసి తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ సినిమాలు, భక్తి, హార్రర్, గ్రాఫిక్స్ ఇలా ప్రతీ జానర్‌లో సినిమాలు తీయడం విశేషం. ఇలా మొత్తం మీద మొత్తం మీద 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. వంద చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి, ఎందరో నటీ నటులకు సినీ జీవితాన్ని అందించి, తెలుగు చలన చిత్ర చరిత్ర పుస్తుకంలో తనకంటూ ఒక పేజీని కేటాయించుకుని వెళ్లిపోయిన కోడి రామకృష్ణ గారికి ఘన నివాళి.