బతుకమ్మ సాంగ్ ఆవిష్కరించిన పఠాన్ చేరు ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ.

0
265
Bathukamma Song 2021 VasidhaTV

పఠాణ్ చేరు: తెలంగాణ సింగిడి పువ్వుల మణిహారం బతుకమ్మ. తెలంగాణ తలమణికమైన బతుకమ్మ వేడుకలను పరస్కరించుకుని వసుధ టీవి, దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ సంయుక్త ఆధ్వర్యంలో బతుకమ్మ 2021 సాంగ్ ను అధ్యక్షురాలు వంశీప్రియ రెడ్డి సారథ్యంలో పఠాన్ చెరు ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ చేతుల మీదగా అవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ అమనేది తెలంగాణ యెక్క రంగురంగుల శక్తివంతమైన పండుగ అని తెలంగాణ స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో, ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా పెరిగే రంగు రంగుల పువ్వులతో జరిపే ఈ పండుగ తెలంగాణ సంప్రదాయానికి గుర్తింపు చిహ్నం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దిశ ప్రొటెక్షన్ వెల్ ఫేర్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు వంశీప్రియా రెడ్డి, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శరెడ్డి, గాయని శ్రుతి కిరణ్ తో పాపటు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.