సమస్యల వలయంలో ఉస్మానియా యూనివర్సిటీ

0
37

ఉద్యమాల పురటి గడ్డ.. ఉస్మానియా యూనివర్శిటి… దేశానికి ఎందరో మేధావులను అందించిన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీని ఇప్పడు పట్టించుకునే వారే కరువయ్యారు.

ప్రస్తుతం సమస్యలతో కొట్టు మిట్టాడుతోంది. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న యూనివర్సిటీ పరిస్థితి ఇప్పుడు అద్వానంగా తయారైంది. సగానికి పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. 12వందల మంది అధ్యాపకులు ఉండాల్సిన యూనివర్సిటీలో ఇప్పుడు 5వందల మంది అధ్యాపకులు మాత్రమే ఉన్నారు.

గవర్నర్ చెప్పిన, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశాలు జారీ చేసిన అధ్యాపక పోస్టులు భర్తీకి మాత్రం నోచుకోవడం లేదు. రీసెర్చ్ స్కాలర్స్‌కి గైడ్ చేసే వారు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు మొత్తుకున్నా యూనివర్సిటీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థులు చెబుతున్నారు.

ఇక అధ్యాపకుల నోటిఫికేషన్ విషయానికి వస్తే.. 2010లో వేసిన నోటిఫికేషన్‌కి 2013లో అధ్యాపకుల భర్తీ జరిగింది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకూ నోటిఫికేషన్ వేయలేదు. రోజుకో సాకుతో నియామక ప్రక్రియ చేపట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిప్పటికి నిబంధనలు రూపొంనందించే సమయానికి భర్తీ ప్రక్రియ చేపట్టని పరిస్థితి ఏర్పడింది.

యూనివర్సిటీ కుంటి సాకులు చెప్పడంతో అదే సమయంలో రిజర్వేషన్ల అంశం కోర్టుకెక్కింది. ఇక డిపార్ట్ మెంట్ వారిగా నియామక ప్రక్రియ చేపట్టాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ప్రక్రియ పెండింగ్‌లో పడింది. యూజీసీ నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు నియామక ప్రక్రియ చేపట్టొద్దని చెప్పడంతో ఈ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ఒక వేళ నియమాక ప్రక్రియకు నోటిఫికేషన్ వచ్చిన.. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఆ పోస్టులు భర్తీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల ప్రక్రియ పూర్తై పాలన వ్యవస్థ గాడిలో పడే సరికి వీసీల పదవి కాలం ముగుస్తోంది. కొత్త వీసీల నియమాకం ఎప్పుడు జరుగుతుందో..? వాళ్ళు వచ్చి నియామక ప్రక్రియ చేపట్టేది ఎప్పుడో..? విద్యా సంవత్సరాలు గడుస్తున్నాయే తప్ప అధ్యాపకుల పోస్టులు భర్తీ మాత్రం జరగడం లేదు.