మంచులో ప్రేమ రాతలు.. లవ్ ప్రపోజల్ అదిరింది.. మ్యారీ మీ అంటూ

0
71

అమెరికాకు చెందిన బాబ్ లెంపా అనే యువకుడు కూడా నిండా ప్రేమలో మునిగిపోయాడు. తన ప్రేయసి కోసం వినూత్నంగా ప్రపోజ్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిలో పడ్డాడు. మ్యారీ మీ అంటూ మంచులో ప్రేమ రాతలు రాసి ప్రేయసి మదిని దోచుకున్నాడు. తద్వారా ప్రియురాలికి వినూత్నంగా ప్రపోజ్ చేసిన ఈ అమెరికన్ నెట్టింట ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున చికాగోలో ప్రముఖ లవర్స్ పార్క్‌గా పేరుగాంచిన మ్యాగీ డాలే పార్క్‌లో కురిసిన మంచుపై మ్యారీ మీ అంటూ రాసి పెగ్గీ బేకర్‌కు చూపించాలని నిర్ణయించుకున్నాడు.

లెంపా ఆ పా‌ర్క్‌నే ఎంచుకోవడానికి కూడా ఓ మంచి కారణం ఉంది. అతని ప్రేమికురాలు పనిచేసే ఆఫీసు ఆ పార్క్ పక్కనే ఉంది. దాంతో మంచులో ఎంతో కష్టపడి, దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి మ్యారీ మీ అంటూ భారీ ఆంగ్ల అక్షరాలను అందంగా పొందుపరిచాడు.

ఇక ప్రేమికురాలు ఆఫీసు 37వ ఫ్లోర్ నుంచి చూస్తే స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేశాడు. ఆఫీసులో అందరూ కిటికీ వద్దకు వెళ్లి పార్క్ వైపు చూస్తుండడం గమనించిన బేకర్ కూడా వెళ్లి చూసి ముగ్ధురాలైంది. ఆ అద్భుతమైన ప్రపోజల్ తన ప్రియుడు బాబ్ లెంపా చేసిందేనని తెలుసుకుని.. ప్రేమికుడికి ప్రేయసి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.