సాక్షి పేపర్ ని చదువుతున్న చంద్రబాబు

0
81

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో “సాక్షి” దినపత్రికను చదవొద్దని చెప్పారు. కానీ చంద్రబాబు “సాక్షి” దినపత్రికను చదువుతున్న ఫోటోలు సోషల్ మీడియా లో విపరీతం గా వైరల్ అవుతున్నాయి. ఇక దీని పై చాలామంది రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. తాజా గా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లో వెళుతున్న సందర్భంలో సాక్షి పత్రికను చదువుతుండగా ఎవరో ఫొటోస్ తీసి అప్లోడ్ చేశారు. ఇక ఈ విషయం పై వైసీపీ నేత విజయసాయి రెడ్డి స్పందించారు. “తమరు సాక్షిని, పిచ్చి ముదిరిన తర్వాత చదివారేమోగానీ..ప్రజలు మాత్రం నిజాలు తెలుసుకోవటానికి మాత్రమే చదువుతారు.” అంటూ సెటైర్లు వేశారు.