భారత సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్ ఒత్తిళ్ళకు లొంగవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టంచేశారు. త్రివిధ దళాధిపతులతో భేటీ అనంతరం ఈ మేరకు స్వేచ్ఛనిచ్చారు. ఈ అత్యున్నత భేటీ సుమారు రెండుగంటల పాటు సాగింది. ఇందులో దూకుడు వైఖరిని కొనసాగించాలని, పాక్ ఒత్తిళ్లకు లొంగరాదని ప్రధాని నిర్ణయించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు, ఎలాంటి కవ్వింపునైనా సరిహద్దులు దాటేవరకూ తిప్పికొట్టండని చెప్పినట్లు తెలుస్తోంది.

నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం విజ్ఞాన్ భవన్‌లో యూత్ ఫెస్టివల్‌కు హాజరైనపుడు పీఎంవో అధికారి ఒకరు ఆయనకు ఓ చీటీ అందించారు. అందులో ‘భారతీయ పైలట్‌ను పాకిస్థాన్ బందీగా పట్టుకుంది’ అన్న విషయం అందులో ఉందని భావిస్తున్నారు. చీటీ చూసిన వెంటనే ప్రధాని హడావిడిగా తన నివాసానికి వెళ్లిపోయారు. మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నిఘా విభాగం అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు కేంద్ర వర్గాల సమాచారం.