అందుకే పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగా.. నరేంద్ర మోదీ వివరణ

PM Modi washing sanitation workers’ feet at Kumbh Mela lands.

0
127

ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళా సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ సర్కారు నిర్వహించిన విధానం, ఏర్పాట్లు అదరహో అనిపించాయని వార్తలు వస్తున్నాయి. భారీ జన సందోహం వచ్చినా.. యోగి సర్కారు కుంభమేళాకు వచ్చిన ప్రజలకు, భక్తులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్‌లో అక్కడి పరిశుభ్రత కారణంగా ఆ ప్రాంతానికి ప్రశంసలు వెల్లువెత్తాయి.

అర్థ కుంభమేళాకు దాదాపు 22 కోట్ల మంది భక్తులు హాజరయ్యారని, ఈ ప్రాంతం పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య కార్మికులు పడ్డ శ్రమను గౌరవించే రీతిలో ప్రధాని మోదీ నడుచుకున్నారు. అందుకే, పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి తన కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్నారు.. మోదీ. చెప్పినట్లే చేశారు. గంగా నది పవిత్రతను కాపాడటంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్రను మోదీ ప్రశంసించడమే కాదు వారి పాదాలు కడిగి ఆపై దుశ్శాలువాలతో సన్మానించారు.

PM Modi washes feet of sanitation workers.

దీంతో, ప్రధాని అంతటి వ్యక్తి ఇలా చేయడంపై ప్రశంసలు కురిశాయి. అదే సమయంలో, విమర్శలు గుప్పించిన వారూ ఉన్నారు. ఈ విమర్శలు చేసిన వారికి మోదీ సమాధానిమిచ్చారు. తాను ఇలా చేసింది ఎన్నికల గిమ్మిక్కు కాదని, తనకు ఉన్న విలువల వల్లే అలా చేశానని మోదీ స్పష్టం చేశారు.