మెరీనా తీరంలో కలకలం… కొట్టుకొచ్చిన మృతదేహాలు..

0
51
Three dead bodies in Chennai marina beach

Three dead bodies in Chennai marina beach

Three dead bodies in Chennai marina beach, Three Dead bodies, chennai, marina beach, Jallikattu, మెరీనా, మృతదేహాలు, విద్యార్థులు

జల్లికట్టు లాంటి ఉద్యమం జరిగిన చెన్నై మెరీనా తీరంలో ముగ్గురు విద్యార్థుల మృతదేహం కొట్టుకురావడం కలకలం రేపింది. నిత్యం పర్యాటకుల రద్దీగా వుండే చెన్నై మెరీనా తీరంలో 8 గంటల వ్యవధిలో మూడు మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపింది.

చెన్నై మెరీనా తీరంలోని శ్రామికుల విగ్రహం సమీపానికి నిన్న ఉదయం 7.30 గంటల సమయంలో ఓ మృతదేహం కొట్టుకురాగా, ఆపై 11.15 గంటల సమయంలో ఒకటి, మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒకటి ఒడ్డుకు చేరాయి.

ఇలా 8 గంటల వ్యవధిలో మూడు మృతదేహాలు కనిపించడంతో పోలీసులు అలర్ట్ ప్రకటించారు. వీరిలో ఒకరు జేఎన్‌ఎన్‌ కాలేజీలో చదువుతున్న కన్నన్‌‌గా, మరొకరిని జయచంద్రన్‌ అనే యువకుడిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.