శభాష్ అనిపించుకున్న భారత నౌకాదళం.. 192 మందిని?

0
66

భారత నౌకాదళం ప్రపంచ దేశాల ప్రజల నుంచి శభాష్ అనిపించుకుంటోంది. ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో సంభవించిన తుఫాను నుంచి 192 మంది పౌరులను కాపాడటంతో భారత నౌకాదళంపై ప్రముఖులు ప్రశంసలు గుప్పించారు.

మార్చి 15న ఇడాయ్ తుఫాను మొజాంబిక్ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన నేపథ్యంలో.. తీరంలో చాలా ప్రాంతం ధ్వంసం అయ్యింది. ఈ నేపథ్యంలో మొజాంబిక్ భారత్‌ను సాయం కోరింది. దీనిపై వెంటనే స్పందించిన భారత నేవీ వెంటనే బెయిరా ప్రాంతానికి మూడు భారీ నౌకలను పంపింది.

గత కొన్నిరోజులుగా భారత నావికా బృందాలు మొజాంబిక్‌లో తుపాను కారణంగా చిక్కుకుపోయిన 192 మందిని రక్షించడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వెయ్యి మందికి పైగా సాయం అందిస్తోంది. భారత నేవీకి చెంది చేతక్ హెలికాప్టర్ కూడా మొజాంబిక్ సహాయక బృందాలతో కలిసి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తోంది.