తెలుగు సినీ ఇండస్ట్రీలో గతంలో సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీస్ చాలా తక్కువగా వచ్చేవి. కానీ ఇపుడు ట్రెండ్ మారుతోంది. పలు హారర్ కామెడీ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. ఆ కోవలోనే ‘నువ్విలా’, ‘జీనియస్’ చిత్రాల ఫేం హవిష్ హీరోగా ‘7’ అనే పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే, విడుదలైన టీజర్, ట్రైలర్ ఆడియన్స్‌లో ఆసక్తి రేకెత్తించాయి. మరీ ముఖ్యంగా, ఒకరు ఇద్దరు కాక ఆరుగురు హాట్ లేడీస్ ఈ మూవీలో ఉండటం అందర్నీఆకట్టుకుంటోంది. ఈ చిత్రం జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ సినిమా ట్రైలర్‌లో హవిష్‌తో లిప్ లాక్ చేస్తూ వరుసగా హీరోయిన్స్ కనిపించటం ఇప్పుడు చర్చగా మారింది.
‘7’లో మెరవబోతోన్న సిక్స్ సెక్సీ బ్యూటీస్ ఎవరంటే… రెజీనా, నందితా శ్వేత, అదితి ఆర్య, అనీష ఆంబ్రోస్, పూజిత పొన్నాడ, త్రిద చౌదరీ. ఇంత ది ఒకే సినిమాలో ఎందుకో మనకైతే ఇప్పుడే తెలియదు. ఆ రహస్యం దర్శకుడు నిజార్ షఫీకే తెలియాలి.
కాకపోతే, ‘7’ అనే టైటిల్ మాత్రం ఆరుగురు ముద్దుగుమ్మలతో ఒక హీరో అన్నట్టుగా సరిగ్గా సరిపోతోంది. ఇక మన లక్కీ బాయ్ హవిష్… మొత్తం ఆరుగురు అందగత్తెలతో ఒక్కో అదర చుంబనం చొప్పున అదరగొట్టేశాడట. మరి ఈ ఘాటు రొమాన్స్ అంతా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం ఇస్తుందో… లెట్స్ వెయిట్ అండ్ సీ.