శాసనసభకు తొలి బడ్జెట్ సమర్పించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఎన్నికల ముందు నుంచీ మనసా వాచా ఒకటే ‘నవరత్న మంత్రం’ జపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. ఆంధ్ర జనం కట్టబెట్టిన అఖండ విజయం తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో.. ఆ నవ విధ సంక్షేమానికే పెద్ద పీట వేశారు. రైతులు, పేదలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, వితంతువులు, వికలాంగులు… ఇలా అన్ని వర్గాల వారికీ బాసటగా నిలిచేందుకు, ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా అండనిచ్చేందుకు ఉద్దేశించిన పథకాలకే భూరి కేటాయింపులు చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం శాసనసభకు సమర్పించిన రూ.2.27 లక్షల కోట్ల బడ్జెట్లో రూ.75 వేల కోట్లకు పైగా సంక్షేమ రంగానికే అందించటం విశేషం. రైతన్నల పైన అయితే ఏకంగా రూ.28,866 కోట్ల వరాల వాన కురిపించారు. మొత్తానికి బడ్జెట్ ఆసాంతం నవరత్నాల ధగధగలే ప్రస్ఫుటంగా కనిపించే అంశం!!
![]() – మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి |
![]() -ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ |
రాష్ట్ర బడ్జెట్ (2019-20) రూ.2,27,975కోట్లు |
వరాల జల్లులు
* రూ.5 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు. |