పొట్టోడ్ని పొడుగోడు కొడితే పొడుగోడ్ని పోచమ్మ కొట్టిందంట..
ఇదీ పూరీ జగన్నాథ్ తన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ లో వాడిన ఓ అచ్చ తెలంగాణ సామెత
హాలీవుడ్ లోని క్రిమినల్ అనే సినిమాలోని పాయింట్ ని కొట్టి.. టాలీవుడ్ సినిమాలో పెడితే.. ఆ టాలీవుడ్ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారన్నదే మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్న పాయింట్..
ఈ మధ్య పూరీ పొజిషనేం బాగోలేదు.. ఏదో మిస్సయ్యి అతడి సినిమాలన్నీ మిస్ ఫైర్ అవుతున్నాయ్..
వద్దన్నా తెర మీద రొమాన్స్ దొర్లించేసి… యూత్ ను అట్రాక్ట్ చేద్దామనుకుంటాడో లేక.. తన స్టైల్ ఇంతే కాబట్టి.. చూస్తే చూడండీ లేకుంటే లేదంటాడో తేలీదు.. కానీ.. ఫ్యామిలీ ఆడియన్స్ కు పూర్తి దూరమై పోయాడు పూరీ..
ఎక్కడ ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మానాన్నా ఓ తమిళమ్మాయి.. ఎక్కడ ఇప్పుడు టెంపర్, లోఫర్, ఇస్మార్ట్ శంకర్.. అంతగా పర్వెర్టడై పోయాడు.. పోకిరీ నుంచి కావచ్చు.. పూరీలో ఈ భయంకరమైన వైబ్రేషన్..
ఒకప్పట్లో పూరీ సినిమా అంటే అదో బ్రాండెడ్ మూవీగా ఉండేది.. ఇప్పట్లో బ్యాడ్ కమ్ మ్యాడ్ మూవీస్ కి కేరాఫ్ గా నిలుస్తోంది.. ఈ పర్వర్షన్ ఎక్కువవటంతో తమ్ముడే కాదు.. సొంత కొడుక్కి ఒక హిట్ ఇచ్చుకోలేని దుస్థితి..
సరే ఇవన్నీ అలా ఉంచితే.. ఇస్మార్ట్ శంకర్ ఎలా ఉన్నాడు? అంటే.. ముందుగా ఈ సినిమాలో రాం పాత్ర గురించే ప్రముఖంగా చెప్పుకోవాలి.. ఇద్దరు హీరోయిన్లున్నా.. ఇవేవీ ఈ సినిమాలో పని చేయలేదు. దర్శకుడు తాను ఎప్పటి నుంచో కలలుగన్న హైదరాబాదీ యువకుడ్ని ఇందులో అచ్చు గుద్దినట్టు ప్రెజంట్ చేసినట్టు కనిపించింది..
అయితే ఎఫ్ టూలో వరుణ్ తేజ్ పలికినంత ఈజీగా.. రాం నుంచి తెలంగాణ స్లాంగ్ డెలివరీ కాలేదేమో అనిపించింది.. అసలే తెలంగాణ యాసలో బీభత్సమైన సినిమాలొస్తున్నాయ్… భారీ హిట్లే కొడుతున్నాయ్.. ఒకరకంగా చెప్పాలంటే ట్రెండ్ ను ఫాలో అవడంలో భాగంగా ఈ సినిమా వచ్చినట్టు కనిపిస్తుంది.
ఆ ఆలోచనలలను మళ్లిస్తూ ఇస్మార్ట్ శంకర్ మనల్ని కథలోకి తీసుకెళ్తూ ఉండగా.. అక్కడక్కడా అతడు ఈ స్లాంగ్ పలకడానికి పడ్డ పాట్లు చెవిన పడుతుంటాయి.. అంతేనా.. ఇస్మార్ట్ శంకర్ లో చాలానే బీప్ లు ఉంటాయి. దీంతో ఇది ఇస్మార్ట్ శంకరా లేక బీప్ స్మార్ట్ శంకరా అర్ధం కాక తికమకపడుతుంటాం…
తర్వాత హీరోయిన్ నభానటేష్ ను ఆమె కోసంగానూ తీర్చిదిద్దిన కేరెక్టర్ హైదరాబాదీ గాళ్ లో అస్సలు చూడబుద్దేయదు.. ఏదో రోడ్డు మీద పేపర్లు ఏరుకునేది.. తెర మీదకొచ్చేసినట్టు కనిపిస్తోంది. ఏ మాత్రం స్త్రీ సహజ సిద్ధమైన అందాలు ఆమెలో కలనిపించవు.. కొన్ని కొన్ని చోట్ల ఆమెను పశువును లాక్కొచ్చినట్టు లాక్కొస్తుంటాడు హీరో,,
ఇదీ అలా ఉంచితే..
ఆడవాళ్ల పట్ల ఇప్పటికే చాలా చాలా సున్నితమైన అంశాలు చర్చనీయాంశమవుతున్నాయ్. అందులో రేప్ ఇష్యూ కూడా ఒకటి. రేప్ చేస్తున్నాడని పోలీసులను పిలిపించిన హీరోయిన్ తర్వాత వీడు నాకు నచ్చేశాడంటూ. వాళ్లను వెనక్కు పంపడం కూడా వివాదాస్పదం అయ్యింది.
ఇవన్నీ అటుంచెయ్యండీ ఇందాకట్నించీ అనుకుంటూనే ఉన్నాం.. ఇస్మార్ట్ శంకర్ ఎందుకు బెటరు ఎందుకు కాదన్నది తేల్చండి ముందు అని ఎదురు చూసే వాళ్ల దగ్గరకే వస్తున్నా….
ఇది కూడా బుర్రకథలాంటి పాయింటే.. డ్యూయల్ సిం, డబుల్ దిమాక్ గాడి గురించి చెప్పబోయే పాయింట్..
ఇక్కడ సంతోషించాల్సిన విషయమేంటంటే.. తెలుగు సినిమా ఇది వరకట్లా లేదు. కాస్త కొత్త పోకడలు, కొత్త పాయింట్లను టచ్ చేస్తోంది..
హీరో నిర్మాతలు దర్శకులను ఇందులో కొత్త ఏముందీ? అని అడగటం ఇటీవల బాగా ఎక్కువైనట్టు కనిపిస్తోంది.. దీంతో ఎంత పెద్ద దర్శకుడైనా.. ఎక్కడెక్కడో హాలీవుడ్ లోలోతులకెళ్లి.. కొత్త కొత్త పాయింట్లను పట్టి.. లేకుంటే సమంత నందినీ రెడ్డికి సజెస్ట్ చేసినట్టు.. కొరియన్ మూవీస్ ను ఒడిసిపట్టి.. కొత్త కొత్త డ్రామాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.
అందులో భాగంగా.. మెమరీ ట్రాన్స్ ఫర్ అనే కాన్సెస్ట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు మన పూరీ..
ఇది ఒకరకంగా మెచ్చుకోదగ్గ అంశం. ఇది పూర్తి క్లాస్ కాన్ ఫ్లిక్ట్ కావడంతో.. ఎక్కడ మాస్ నాడి పట్టదో అన్న అనుమానంతో.. శంకర్ లాంటి క్రిమినల్ మైండెడె ఫెలో కేరెక్టర్ ను ఎస్లాబ్లిష్ చేశాడు.
అసలీ సినిమాకు మెమరీ ట్రాన్స్ ఫర్ కొత్త పాయింట్ అయితే.. దాన్ని డామినేట్ చేసి.. అదేం పెద్ద విషయం కాదు.. శంకర్ గాడి టాలెంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటూ.. మనకు తెర మీద దర్శనమిస్తుంది.. రాం గాడి విశ్వరూపం..
ఇప్పటి వరకూ కేవలం బబ్లీబాయ్.. లవర్ బాయ్ వేషాలేసిన రామ్.. ఈ సినిమాలో.. మాస్ లుక్ లో అదరగొట్టేశాడు.
మొదట్లో ఈ కేరెక్టర్ ను రిసీవ్ చేసుకోడానికి కొంత సమయం పట్టినా.. తర్వాత తర్వాత ఆటోమేటిగ్గా జనాన్ని పట్టేస్తూ పోతుంది.. ఇస్మార్ట్ శంకర్..
ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే.. ఒకే మనిషి రెండు జీవితాలు రెండు జ్ఞాపకాల సమస్యను అత్యంత సున్నితంగా.. హ్యాండిల్ చేయాల్సింది.. రఫ్ అండ్ టఫ్ గా ట్రీట్మెంట్ అందుకోవడంతో.. ఆ ద్వంద్వ నీతి కాస్తా.. పూరీ.. రాంల మధ్య పడి నలిగిపోయినట్టు కనిపించింది..
దాదాపు ఇదే డ్రామాగల ఓ బేబీ కావచ్చు.. బుర్రకత కావచ్చు.. ఆ యా డ్యూయాల్టీస్ ను ఇస్మార్ట్ కన్నా మించి హ్యాండిల్ చేసినట్టు అనిపించాయ్..
డబుల్ డ్రామాను వాడుకోవడానికి ఎంతో స్కోపున్నా పూరీ అందుకు తగిన న్యాయం చేయలేదనిపిపించింది.
నాకు ఇంకోటి కూడా అనిపించింది.. మాములుగా లాగ్ దర్శకులు కొందరుంటారు. పూరీ వీళ్లకు భిన్నం.. ఒకింత ఎక్కువ ఫాస్ట్.. ఈ వేగంలో పడి.. పాయింట్లోని ఆ బ్యూటీని సరిగా విష్కరించలేక పోయాడేమో అనిపించింది.
ఏతా వాతా ఇదెలాంటి సినిమా అంటే.. ఎవరి కోసమైతే అన్వేషణ సాగుతుందో.. అదే మనషి కోసం అదే మనిషి ఇన్వెస్ట్ గేట్ చేయటం అనే పాయింట్ అంతర్లీనంగా కనిపించింది.
ఇలాంటి సున్నితాంశాలేవీ.. పూరీ సూపర్ ఫాస్ట్ టేకింగ్ కెపాసిటీ.. రాం సూపర్ పెర్ఫామెన్స్ లెవల్స్ ముందు నిలబడలేదు..
ఎటు నుంచి ఎటు చూసినా.. రాం పూరీల మధ్య సాగిన పోరాటమే కనిపిస్తుంది.. ఎప్పుడో క్లైమ్యాక్స్ లోకానీ హీరోకి తన విలనెవరో తెలీదు.. నువ్వేనా నా విలన్ గాడివి.. పెద్దమ్మ గుడి ముందు పొటేలు నువ్వేనా.. అంటూ హీరో అతడ్ని చూసి… తెలుసుకోవడాన్ని బట్టీ.. ఇక్కడెంతగా విలన్ వర్సెస్ హీరో డ్రామా మిస్సయ్యిందో అర్ధమవుతూనే ఉంది.
వీటన్నిటినీ అలా ఉంచితే.. రాం తన కెరీర్ లోనే ఒక మాన్యుమెంట్ లాంటి కేరెక్టర్ నైతే చేసేశాడు. కానీ ఈ కేరెక్టర్ ను కేవలం యూత్ కమ్ బాగా ముదురు ప్రేక్షకులు మాత్రమే ఆస్వాదించదగినట్టుగా తీర్చిదిద్దడమే ఇక్కడ అతిపెద్ద లోపం..
ఇవాళ్రేపు కుటుంబ ప్రేక్షకులైతే థియేటర్ల వైపు రారు. పూరీ తీసిన ఇస్మార్ట్ శంకర్ ఉందిగా అన్న ఆలోచనే చేయడం లేదు. అవసరమైతే.. ది లయన్ కింగ్ వెళ్దామనుకుంటున్నారు. ఎందుకంటే పోయిన వారం ఆల్రెడీ ఓ బేబీ చూసేశారు కాబట్టి..
ఇదీ పూరీ కమ్ రాం ఇస్టామార్ట్ శంకర్. పూరీ రేంజ్ కి తీసినట్టే కనిపించినా.. కొన్ని లోపాలైతే కొట్టొచ్చినట్టు కనిపించాయ్.. వాటిలో కామెడీ కూడా ఒకటి.. గెటప్ శీను కేరెక్టర్ ఉన్నా.. అది ఎందుకూ పనికిరాకుండాపోయింది.
ఇక నుంచి పూరీ.. తాను కెరీ్ర్ మొదలు పెట్టిన తొలినాళ్లలోకి వెళ్లి.. అప్పుడు తీసినట్టు శ్రావణీ సుబ్రమ్మణ్యంలాంటి చిత్రాలను తీయడం బావుంటుందేమో.
ఒకే జానర్ ఒకటే స్టైల్లో సినిమాలు తీయటం వల్ల నష్టం తప్ప లాభం ఉండదు. వల్గారిటీని బాగా తగ్గించి.. తన చిత్రాలను కుటుంబ ప్రేక్షకుల మెదళ్లలో తిష్ట వేసేలా చేస్తే సరిగా ఉంటుందేమో..
అలా జరగాలంటే.. తన నిజజీవితంలో తాను ఫాలో అవుతున్న బ్యాడ్ హాబిట్స్ కూడా వదిలేస్తేగానీ.. సాధ్యం కాదేమో.. అవేంటో ప్రత్యేకించీ చెప్పక్కర్లేదనుకుంటా.. ఉంటా బాయ్..