బుర్ర కథ నిజంగా మంచి ప్రయత్నమే..
కానీ అందుకు తగ్గ డైరెక్టర్ కానీ సెట్ అయి ఉంటే.. బావుండేది.
కానీ ఇక్కడ రచయితగా డైమండ్ రత్న బాబు మంచి పాయింట్ ను టచ్ చేసినా
డైరెక్టర్ గా దాన్ని హ్యాండిల్ చేయలేక చేతులెత్తేశాడు.
నిజానికి డైమండ్ రత్న బాబు ఎస్ఎస్సీ అంటూ తన డైరెక్షనల్ క్రెడిట్స్ లో రాసుకోవడం బాగనిపించింది..
పదో తరగతి చదివిన వాడు నిర్భయంగా చెప్పుకోవడం ఒక ఎత్తు అయితే ఇంత వరకూ రావడం మరో ఎత్తు..
సరే ఆ పది కూడా సరిగా చదవకుండానే సచిన్ భారత రత్న అందుకోలేదా?
ఆ మాటకొస్తే.. బాలీవుడ్ లో ఇంటర్ కూడా చదవని.. వాళ్లు సూపర్ స్టార్లు కావడం లేదా?
అంతెందుకూ మన దక్షిణాదిన లోకనాయకుడిగా పేరున్న కమల్ హాసన్ కు.. కనీస చదువు లేదు..
ప్రేమ కావ్యాలు తీసిన ఖదిర్ అనే తమిళ దర్శకుడైతే ఎయిత్ క్లాసే చదివాడు..
పుస్తకాలు చదవడం కాదిక్కడ జీవితం చదవటం ముఖ్యం
అందుకే నిర్మాణ కూలీ అయిన జాకీ చాన్ జగత్ ప్రసిద్ధమయ్యాడు..
ఇదంతా అలా ఉంచితే బుర్రకథ ఎలా ఉందీ? అన్నదిక్కడ పాయింటు..
బుర్రకథ నిజంగా అయితే మంచి ఫ్లాట్ తీసుకున్నాడు..
ఇది ఒకరకంగా చెబితే సవ్యసాచిలా ఉంటుంది. ఆ సినిమాలో హ్యాండ్ లో డీవియేషన్ చూపితే.. ఈ సినిమాలో.. బుర్రలో చూపాడు దర్శకుడు. అంతే తేడా మిగిలినదంతా సేమ్ టూ సేమ్..
ఇక్కడ రత్నబాబైనా.. నందినీరెడ్డి అయినా.. అందరూ చూసేది ఒక్కటే..
డ్రామా నడపడానికి సరైన స్లాట్ వెతుక్కోవడం.. అందులో తమ స్థాయికి తగ్గ సన్నివేశాలను నింపడం..
ఆ దోబూచులాట నచ్చిన ప్రేక్షకులు సినిమా సూపర్ అంటూ విజిళ్లూ చప్పట్లు కొట్టడంలోనే ఉంటుందంతా.. కానీ ఇక్కడే రత్నబాబు మన టీమిండియా సెమీ ఫైనల్స్ లో బోల్తా కొట్టినట్టు కొట్టేశాడు..
రత్నబాబు సినిమా స్టార్టింగ్ లో కాస్త లాగ్ లో నడిపాడు..
కొన్నిసార్లు పాత్రలు కేవలం డైలాగులు చెప్పి వెళ్లి పోతుంటాయనిపించింది..
ఈ గ్రేస్ మిస్సవడం సినిమా నుంచి ప్రేక్షకులను డ్రాపయ్యేలా చేస్తుంది..
రాన్రాను సినిమా బాగానే స్పీడందుకుంటుంది. కానీ మొదట్లోనే.. కాస్త బ్రేకివ్వడం వల్ల.. తర్వాతి ప్రయత్నమంతా వృధాగా మారిపోతుంది..
గుడ్ అటెంప్ట్.. తన స్థాయికి మించి రత్నబాబు ఈ చిత్ర కథను ఎంపిక చేసుకున్నందుకు అభినందనలు..
అతడికిది మొదటి దర్శకత్వ ప్రయత్నం…
కానీ ఇందులోనే టాక్ ఆఫ్ ద టాలీవుడ్ టౌన్ కావల్సింది.. కాలేక పోయాడు..
దానికి తోడు ఆది కూడా ఎప్పటి నుంచో తనకో మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. బట్ అతడి ఆశలననీ అడియాశలే అవుతున్నాయ్..,
సినిమాలో కొన్ని సన్నివేశాల్లో కాన్ ఫ్లిక్ట్ ఉంది..
కొన్ని టెన్షన్ బిల్డప్పులున్నాయ్..
ఒకే మనిషిలోని రెండు కేరెక్టర్లు.. వాటి ద్వారా పుట్టిన డ్రామా ఇవన్నీ బాగానే ఉన్నాయ్..
కానీ మొదటే అనుకున్నట్టు ఎందుకనో ఎక్కడో గ్రేస్ మిస్సయ్యంది..
ఈ గ్రేస్ క్లాస్ వర్కవుట్ చేయడం వల్లే దర్శకులు తమకంటూ ఒక స్టామినా ఉందని ప్రూవ్ చేస్తుంటారు..
ఇక్కడే రత్నబాబు దర్శకుడిగా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు..
ఇది అతడి సామర్ధ్యానికి సంబంధించిన విషయం..
నువ్వే నువ్వేతో త్రివిక్రం అనే రచయిత దర్శకావతారం ఎత్తినప్పుడు అందరూ కామ్ గానే ఉన్నారు..
కానీ అతడు అతడు తీసినప్పుడే ఇండస్ట్రీ ఉలిక్కి పడి చూసింది అతడి వైపు..
ఇదే రత్నబాబు అచీవ్ కావల్సిన అంశం..
ఇది అంత తేలికైనది కాదు..
రచయితగా మొదట అదుర్స్ అనిపించుకున్నాక
తర్వాత దాన్ని దర్శకత్వంలోకి మళ్లించవచ్చు(ఏదీ.. అంటే అదే స్టామినా)
కథాంశంగా తీసుకున్న ఆలోచన బావుంది.
కానీ దాన్ని ఒకటికి పది సార్లు ఆలోచించి..
సన్నివేశాలుగా మళ్లించి ఉండాల్సింది..
బేసిగ్గా రచయితలు దర్శకులుగా మారినప్పుడు ఏం చేస్తారంటే..
తామే రచయితలం కదా? మరో రచయితతో పనేంటన్న ఒంటెత్తు పోకడ పోతారు..
ఇదే రత్నబాబును ముంచినట్టుంది..
మాములుగా అయితే.. ఇంతగా రాయాల్సిన పన్లేదు. కానీ రచయితగా రత్నబాబు పట్టుకున్న లైన్ మంచిది కాబట్టి.. దర్శకుడిగా ఈ సారికైనా కాస్త మెరుగవుతాడేమో అన్న చిన్న ఆశ.
ఈ సినిమాలో అభిరాం అనే ఇద్దరు ఒకడ్లోనే ఉండటం..
ఆ ఇద్దరూ కలసి ఒకరి ఆశలూ ఆశయాలను కాలరాసుకోవడం..
తర్వాత ఒకే అమ్మాయి వెంట పడ్డం..
తర్వాత ఆమెనే పెళ్లాడం..
మధ్యలో సన్యాసం బ్రహ్మచారి మఠం వగైరా ఉండటం..
ఇదంతా బాగానే వర్కవుట్ అయ్యింది..
మిస్సయ్యిందెక్కడంటే..
పృద్వీ కేరెక్టర్ దగ్గర, విలన్ కేరెక్టర్ ల దగ్గర కాస్తా మిస్సయ్యింది.
మరీ పృధ్వీ కేరెక్టర్ బొంగరాలతో కడుపు తగ్గించడం వగైరా నమ్మశక్యంగా లేదు..
ఇక విలన్ ట్రాక్ కామెడీ చేయడానకి ట్రై చేయటం కూడా బెడిసి కొట్టింది..
ఆ తర్వాత చెప్పడం మరచి పోయా..
చాగంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది రత్నబాబు మీద
పదే పదే చాగంటి రిఫరెన్సులున్నాయ్..
అంతేనా.. ఎడా పెడా ఇతర పాటలను వాడేశాడు..
ఈ రిఫరెన్సులతో పాటు ఈఎంఐవంటి వాటిని కాస్త ఆలోచించి.. రాసుండాల్సింది.. ఇవన్నీ రత్నబాబు రచనను దిగజార్చాయి..
అభి లేని రామ్ లేడని నిరూపించడం మంచి మెసేజే..
మనలో అంతా మంచే ఉంటే మునిగిపోతాం.. కాసింతైనా చెడు గుణముంటేనే మనలోని మంచిని బతికించుకుంటామని నిరూపిస్తుంది ఈ చిత్రం. .
గుడ్ బాగానే ఉంది..
ఎనీహై ఐ విష్ హిం ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఫిలిం..