డిప్యూటీ కమీషనర్ ఆత్మహత్య

0
47

హరియాణలోని ఫరీదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఫరీదాబాద్‌ పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌ విక్రమ్‌ కపూర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయాన్నే ఆయన తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని మృతి చెందారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈయన మృతిపై ఫరీదాబాద్‌ ప్రజా సంబంధాల అధికారి సూబే సింగ్‌ మాట్లాడారు. నగరంలోని సెక్టార్‌ 30 పోలీస్‌ లేన్స్‌లోని తన నివాసంలో ఉదయం 6గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పడానికి చింతిస్తున్నాం. మృతికి గల కారణాలపై విచారణ జరుగుతోంది అని తెలిపారు. అయితే పని ఒత్తిడి కారణంగా విక్రమ్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన విక్రమ్‌ గత ఏడాదే ఐపీఎస్‌గా పదోన్నతి పొందారు.