పిప్పి పళ్ల సమస్య ఇకపై ఉండకపోవచ్చు. ఎందుకంటే.. యూనివర్సిటీ ఆఫ్ ప్లైమౌత్ శాస్త్రవేత్తలు పిప్పి పళ్లను నయం చేయగల మూలకణాలను ఎలుకల్లో గుర్తించారు.. కాబట్టి.. సరైన పంటి సంరక్షణ చర్యలు తీసుకోకపోతే కొంతకాలానికి చెడు బ్యాక్టీరియా చేరిపోయి పిప్పి పళ్లు వస్తాయని తెలిసిన విషయమే.. దురదృష్టవశాత్తూ ఈ పిప్పి పళ్లు ఏర్పడే ప్రాంతంలో డెంటిన్‌ను శరీరం తయారు చేసుకోలేదు. కానీ.. ఎలుకలు దీనికి భిన్నం. ఈ నేపథ్యంలో ప్లైమౌత్ యూని వర్సిటీ శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు జరిపి.. ఎలుకలకు ఉన్న ఈ లక్షణానికి వాటి కం డరాల్లో, ఎముకల్లో ఉండే ప్రత్యేకమైన మూలకణాలు కారణమని తేల్చారు. ఈ మూలకణాలు డెంటిన్ ఉత్పత్తి చేయడంతో పాటు డీఎల్‌కే–1 అనే జన్యువు ద్వారా ఎన్ని కొత్త కణాలు పుట్టా లో కూడా నియంత్రిస్తున్నట్లు పరిశోధనల ద్వా రా తెలిసింది. డీఎల్‌కే1 జన్యువు కూడా పంటి కణజాలం పెరుగుదలలో, గాయాలను మాన్పడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ మూల కణాలు మానవుల పంటిలో ఉన్నాయా అనే విషయం ఇంకా తెలుసుకోవాల్సి ఉందని డీఎల్‌కే–1 వంటి జన్యువే మన పంటి పెరుగుదలను నియంత్రిస్తోందా అనేది కూడా చూడాలని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త బింగ్ హూ తెలిపారు. త్వరలోనే ఈ సమస్య తొలగిపోతుందని పేర్కొన్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -