అతిపెద్ద ధనవంతుడిగా 13వ స్థానంలో ముకేశ్‌ అంబానీ

0
90

రిలయన్స్‌ అధినేత, బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ సంపద అప్రతిహతంగా పెరుగుతోంది. ప్రధానంగా జియో ఫైబర్‌ ప్రకటన అనంతరం అంబానీ మునుపెన్నడూ లేనంతగా అమాంతం ఎగిసింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ ఆధారంగా  49.9 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలో అత్యంత ధనవంతుల జాబితాలో 13వ స్థానంలో  ఉన్న అంబానీ  తాజాగా మరింత  దూసుకుపోతున్నారు. ఆగస్టు 12 నాటి రిలయన్స్‌ వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం రెండురోజుల్లోనే రూ.29వేల కోట్లు మేర పుంజుకున్నాయి. మార్కెట్ వ్యాల్యూ రూ.80 వేల కోట్లు పెరిగింది. ఆగస్ట్ 12వ తేదీ ప్రకటన తరువాత రిలయన్స్‌ షేర్లు 11 శాతం పెరిగాయి. అదే విధంగా అంబానీ ఆస్తులు 4 బిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో 28,684 కోట్లు పెరిగింది. వార్షిక​  ప్రాతిపదికన అంబానీ సంపద 6 శాతం పెరగ్గా, రిలయన్స్‌ షేర్లు 15 శాతం ఎగిసాయి.