24 గంటల్లో కోస్తా, రాయలసీమకు వర్షాలు

0
46

ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకావం ఉందని కేంద్రం వివరించింది. ఉరుములతో కూడిన కొద్దిపాటి గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఉన్నందున అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల సోమవారం వర్షాలు పడ్డాయి. మార్కాపురంలో 8, సింగరాయకొండ, ఒంగోలు, గంట్యాడలో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వచ్చే 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల మోస్తరు, అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయి. మరోవైపు ఉత్తర జార్ఘండ్‌, బిహార్‌ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది