ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకావం ఉందని కేంద్రం వివరించింది. ఉరుములతో కూడిన కొద్దిపాటి గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఉన్నందున అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల సోమవారం వర్షాలు పడ్డాయి. మార్కాపురంలో 8, సింగరాయకొండ, ఒంగోలు, గంట్యాడలో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వచ్చే 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల మోస్తరు, అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయి. మరోవైపు ఉత్తర జార్ఘండ్, బిహార్ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -