మొక్కజొన్నతో ఆరోగ్యం

0
130

వాతావరణం ఏ మాత్రం చల్లగా మారినా… వేడివేడిగా మొక్కజొన్న కంకుని తినాలన అనిపిస్తుంది. ఇది రుచినే కాదు… ఇందులోని పోషకాలు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి.

ఇందులో ఉండే పీచు జీర్ణాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. అజీర్తిని నివారించి  మలబద్ధకం సమస్యను వదిలిస్తుంది. అధిక బరువునూ నియంత్రిస్తుంది. మొక్కజొన్నలో ఉండే కెరొటినాయిడ్లు, బయోప్లవనాయిడ్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. కండరాల క్షీణతను దూరం చేస్తాయి.

మొక్కజొన్నలోని పిండిపదార్థాలు శరీరానికి  శక్తిని అందిస్తాయి. చురుగ్గా ఉండేలా చేస్తాయి. దీనిద్వారా అందే ఫైటోకెమికల్స్‌ రక్తంలో చక్కెరస్థాయుల్ని అదుపులో ఉంచుతాయి.

గర్భిణులకు అవసరమయ్యే ఫోలిక్‌ యాసిడ్‌ సైతం మొక్కజొన్న నుంచి కొంతవరకూ పొందొచ్చని అంటారు నిపుణులు.
ఇన్నిరకాలుగా మేలుచేసే మొక్కజొన్నను కేవలం కాల్చుకుని మాత్రమే కాదు… ఉడికించీ తీసుకోవచ్చు.