‘హలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై.. ప్రస్తుతం ‘హీరో’ చిత్రంతో తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది డైరెక్టర్ ప్రియదర్శన్, నటి లిజిల వారసురాలు కల్యాణి ప్రియదర్శన్. ప్రస్తుతం సెట్స్‌పై వున్న ‘హీరో’లో శివకార్తికేయన్‌కు జోడీగా నటిస్తుండగా, వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న ‘మానాడు’ చిత్రంలో ఛాన్స్ వచ్చింది. అలాగే మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా ఆమె తండ్రి ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న ‘మరైక్కార్ – అరబిక్కలిండే సింహం’ అనే చిత్రంలో అతిథి పాత్రకు ఎంపికైంది. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా కీర్తిసురేష్ నటిస్తోంది. తొలిసారిగా తండ్రి దర్శకత్వంలో నటిస్తుండడంపై కల్యాణి స్పందిస్తూ, ‘నాన్న దర్శకత్వంలో నటించడం టెన్షన్‌గానే వుంది. మైకులో ఆయన యాక్షన్ అని అరిచారంటే చాలు భయపడిపోతాను. నాన్నతో తిట్లు తినకుండా నటించాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. కెమెరా ముందు చేసే చిన్న తప్పు కూడా ఆయన కనిపెట్టేస్తారు. ఏమైనా ఒక దిగ్గజం, అందులోనూ నా తండ్రి దర్శకత్వంలో నటించడం నా అదృష్టం’’ అని పేర్కొంది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -