
రెండు నెలల పాటు క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. యూఎస్‌లో గోల్ఫ్ ఆడుతూ కొత్త అవతారంలో కనిపించాడు. గురువారం జాతీయ క్రీడల దినోత్సవం కావడంతో ధోని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు. టీమిండియా సహచర ఆటగాడు కేదార్ జాదవ్‌తో కలిసి ధోని గోల్ఫ్ ఆడాడు.
ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో సభ్యుడిగా లేని జాదవ్.. ధోనితో కలిసి గోల్ఫ్ క్రీడను ఆస్వాదించాడు. పారామిలటరీ రెజిమెంట్‌లో సేవ చేసేందుకు రెండు నెలల పాటు క్రికెట్ నుంచి ధోని వైదొలిగిన సంగతి తెలిసిందే. భారత సైన్యంలో 106 టీఏ పారా బెటాలియన్‌తో కలిసి 15 రోజుల పాటు ధోని పనిచేశాడు. జూలై 30వ తేదీ నుంచి ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ తీసుకోవడంతో అక్కడ విధుల్లో పాల్గొన్నాడు. కాగా, దక్షిణాఫ్రికాతో వచ్చే నెలలో ఆరంభం కానున్న టీ20 సిరీస్‌కు సైతం ధోని అందుబాటులో ఉండటం లేదు