ఒక పోలీసు అధికారి మర్డర్ జరుగుతుంది.
ఆ మర్డర్ ఇంటరాగేషన్ చుట్టూ
ఈ సినిమా మొత్తం తిరుగుతుంది..
ఒక నిందితురాలు
తనను రేప్ చేశాడన్న కారణం చేత
ఆ పోలీసు అధికారిని హత్య చేయటం
అన్నది ఈ సినిమాకు సెంటర్ పాయింట్
ఈ ఇంటరాగేషన్లో ఒక సాధారణ ఎస్సైలా ప్రవేశించిన హీరో..
ఆ నిందితురాలి చేత
ఒకే విషయాన్ని రకరకాలుగా చెప్పించడం..
అన్నిసార్లు ఒకే విషయాన్ని చెప్పించినా.. అది ఎంత మాత్రం బోరు కొట్టకుండా చూడ్డం
ఈ సినిమాలో దర్శక రచయితలు వాడిన టెక్నిక్
ఇంతకీ ఈ సినిమా ప్రధానోద్దేశమేంటి? ఎందుకీ చిత్రాన్ని తీయించినట్టు..
గతంలో ఇదే చిత్రం బదలా అన్న పేరిట
హిందీలో అమితాబ్, తాప్సీ వంటి ప్రధాన పాత్రధారులు నటించగా వచ్చింది..
బదలా బాగుందన్న పేరు కూడా సాధించింది..
ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటికీ అనుగుణంగా చిత్రించారా లేదా అన్న మాట పక్కన పెడితే..
దీని ద్వారా మనమేం తెలుసుకోవచ్చు? అన్నది ఒక సారి చూస్తే..
ఇవాళ్రేపు అమ్మాయిలు డబ్బుగల వాడ్ని పెళ్లాడ్డమే ధ్యేయంగా ఎంత రిస్కయినా తీసుకుంటారని చెప్పడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు..
తనకు కాబోయేవాడు గే అయినా.. డబ్బు కోసం వాడ్ని పెళ్లాడి..
వాడి బదులు తన శారీరక వాంఛలు తన క్లాస్ మేట్ ద్వారా తీర్చుకోవాలన్నది ఆమె ఎత్తుగడ.
అంటే
ఇప్పుడున్న రోజుల్లో మనిషి డబ్బుకు తొలి ప్రాధాన్యతనిచ్చి.. తర్వాత తన మనోవాంఛలకు చోటిస్తున్నారన్న అర్ధం ఇందులో స్పష్టంగా ధ్వనిస్తుంది..
మరీ ముఖ్యంగా అమ్మాయిల విసృలంఖ ఆలోచనా ధోరణి ఇందులో క్లియర్ కట్ గా కనిపిస్తుంది..
ఇది నిజంగా ఈ కాలానికి సంబంధించిన సినిమా..
ఆ మాటకొస్తే ఈ కాలపు మనుషుల అనైతిక ప్రవర్తనా ధోరణికి అద్దం పట్టే చిత్రం..
ఇందులో సగటు ప్రేక్షకుడికి ఏం లభిస్తుంది? అంటే,
చివరి వరకూ ఏం జరుగుతుందో చూద్దామన్న బిగి వీడని ఆసక్తి ఎక్కడా కట్టు తప్పదు..
సాధ్యమైనంత వరకూ ఒక ఇంట్లో చిత్రం నడపటం అన్న రెండో టెక్నిక్ కూడా ఇందులో బాగా వర్కవుట్ అయ్యింది..
దీని ద్వారా లొకేషన్ ఖర్చు.. హర్రీబర్రీ గా షూటింగ్ చేయాల్సిన దుస్థితి.. వీటన్నిటికీ కట్ చెప్పొచ్చు..
గతంలో తాప్సీ నటించిన ముల్క్ కూడా దాదాపు ఇదే టెక్నిక్.. కోర్టులోనే ఎక్కువ సేపు చిత్రణ సాగుతుంది..
ఈ చిత్రమంతా దాదాపు ఒకే ఇంటిలో నడిపించేశారు..
గట్టిగా ఓ డజను సీన్లు తప్ప.. మిగిలిన సీన్లన్నీ ఇంట్లోనే..
బాధితుడే.. పోలీసు అధికారిగా వచ్చి.. నిందితురాలి చేత..
నిజం ఎలా కక్కించాడన్న పాయింట్ ఈ సినిమాకు సెంట్రల్ లాక్..
ఈ లాక్ ఎప్పుడు రివీల్ అవుతుందా? అని ఎదురు చూడ్డంతో
ఇంటర్వెల్ బ్యాంగ్ ఎప్పుడు పడుతుందో తెలీదు..
క్లయిమ్యాక్స్ ఎప్పుడొస్తుందో తెలీదు..
అంత సాఫీగా సాగిపోతుంది..
ఫైనల్ థాట్ ఏంటంటే..
అడవి శేష్ ఈ జానర్ లో తప్ప సినిమాలు చేయలేడా? అన్న బాధ కూడా కలుగుతుంది.. అతడి మొహం ఉన్న స్ట్రక్చర్ ను ఎక్కువ సేపు ప్రేక్షకులు చూడాలంటే.. సస్పెన్స్ అన్న నిద్ర మాత్ర వేస్తే తప్ప.. సాధ్యం కాదా? అనిపిస్తుంటుంది.
అసలు శేష్ అంటే మీకు అర్ధం తెలుసా?
సస్పెన్స్ కమ్ సెంటిమెంట్ ఈజ్ ఈక్వల్టూ శేష్..
క్షణంలో ఒక కూతురు తండ్రి కథ.
గూఢాచారిలో ఒక తండ్రీ కొడుకుల కథ.
ఈ సారి కూడా అంతే..
ఎవరు.. కూడా ఒక తండ్రీ కొడుకుల కథే..
తండ్రి మిస్సయితే.. ఆ కొడుకు పడే ఆరాటమే ఈ కథ.
తన తండ్రిని చంపిన నిందితురాలి చేత నిజం కక్కించి..
ఆమెకు తగిన శిక్ష వేయించే వరకూ నిద్రపోని ఒక కొడుకు కథ ఇది..
సో
ఇప్పటికే మూడు శేష్ సినిమాలు..
బాగానే ఉన్నా
కొత్త జానర్ లో ఏదైనా
ట్రై చేస్తే..
ఇతడికి అన్ని యాంగిల్స్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయటం వచ్చని భావించవచ్చు
లేకుంటే ఇతడి కెరీర్.. గత కాలపు మధుబాబు నవలల్లాగా మిగిలిపోతుందేమో అన్న ఆలోచన ఏర్పడుతోంది.
అరె.. అలాగంటే మధుబాబు నవలలు బోరింగా ఉంటాయని కాదు..
ఒకే జానర్ లో ఎంత కాలమన్నదే ఇక్కడ కొచ్చినింగు? అంతే..
ఇంకేం లేదు..
స్వస్తి..
సర్వే సినీ జనా సుఖినోభవంతు
ఓం శాంతి శాంతి శాంతి…!!!