ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో నిరాశపరిచిన నందమూరి బాలకృష్ణ లాంగ్ గ్యాప్ తరువాత కేయస్ రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. తాజాగా నందమూరి అభిమానులకి దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన మరో పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
చేతిలో రక్తపు కత్తి, ఒంటినిండా పసుపుకుంకుమతో యాంగ్రీ లుక్‌లో బాలయ్య కనిపిస్తుండటంతో మరోసారి బాక్సాఫీస్ దుమ్మురేపడం ఖాయమంటున్నారు నందమూరి అభిమానులు. తొలుత సినిమాకు సంబంధించి బాలయ్య లుక్ చూసి అందరూ క్లాస్ సినిమా అనుకున్నారు.. కానీ తాజా లుక్‌తో మాస్ అభిమానులు మరోసారి పండగ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ కథానాయికగా నటిస్తోంది. భూమిక చావ్లా కీలక పాత్రలో నటిస్తోంది. కమర్షియల్ దర్శకుడిగా పేరున్న కేయస్ రవికుమార్ డైరెక్షన్‌లో బాలకృష్ణ సక్సెస్‌ట్రాక్‌లోకి వస్తాడని భావిస్తున్నారు. కాగా ఈ సినిమా తెరకెక్కిస్తూనే బాలకృష్ణ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లు సమాచారం.