నగర వినియోగదారులకు ఊరట. దిగొచ్చిన ఉల్లి ధర.

0
68

ఉల్లిపాయల ధరలు క్రమేపీ దిగి వస్తున్నాయి.  మహారాష్ట్రలో వరదలు రావడం, అయ్యప్ప మరోవైపు దసరా, దీపావళి పండుగలు… ఇవన్నీ ఉల్లి పాయలకు డిమాండు పెంచేవే! ఈ డిమాండును సొమ్ము చేసుకోవడానికి కొంతమంది వ్యాపారులు సృష్టించిన కృత్రిమ కొరతను రాష్ట్ర ప్రభుత్వం ఛేదించింది. విజిలెన్స్, మార్కెటింగ్‌ శాఖల అధికారులు సంయుక్తంగా చేపట్టిన చర్యలు ఫలించాయి. విశాఖ నగరంలోని 13 రైతు బజార్లలో వినియోగదారులకు కావాల్సినన్ని ఉల్లిపాయలు రూ.25కే లభ్యమవుతున్నాయి. ఇలా తక్కువ ధరకే ఉల్లి అందించేందుకు మార్కెట్‌ జోక్య పథకం కింద కేంద్ర మార్కెట్‌ ఫండ్‌ (సీఎంఎఫ్‌) నుంచి మరో రూ.3 కోట్లను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. ఈ చర్యలతో వినియోగదారులకు ఊరట లభిస్తోంది.