ప్రముఖ పాత్రికేయులు, సీనియర్ జర్నలిస్ట్, విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి (81) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. నిబద్దత కలిగి, విలువలకు జీవితాంతం కట్టుబడిన కమ్యూనిస్టుగా విజ్ఞానఖనిగా రాఘవాచారి పేరు గాంచారు.
1972లో విశాలాంధ్ర ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాఘవాచారి 2005 వరకు కొనసాగారు. రాఘవాచారి స్వస్థలం వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం. 1939 సెప్టెంబరు 10న ఆయన జన్మించారు. నిబద్ధతత, విలువలతో కూడిన జర్నలిజానికి మారుపేరుగా నిలిచారు. చక్రవర్తుల రాఘవాచారి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్, కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ సంతాపం తెలిపారు. విలువలతో కూడిన జర్నలిజాన్ని ఆయన విశ్వసించారని, యువ తరాలకు రాఘవాచారి ప్రేరణగా నిలిచారని జగన్ కొనియాడారు.