తనకు పాస్ బుక్ ఇస్తావా ? లేకపోతే తహశీల్దార్ విజయారెడ్డి తరహాలోనే నిన్ను కూడా చంపేస్తానని కామారెడ్డి ఆర్డీవోకు బెదిరింపు ఫోన్ కాల్ రావడం కలకలం రేపుతోంది. భూ వివాదంలో న్యాయం చేయలేదని ఓ కానిస్టేబుల్ ఫోన్ చేసి ఆర్డీవో రాజేంద్రకుమార్‌ను బెదిరించాడు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో రాజేంద్రకుమార్‌కు ఫోన్ చేసిన శ్రీనివాసర్ రెడ్డి తన భూమి విషయంలో న్యాయం చేయలేదని.. అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్‌కు పట్టిన గతే నీకూ పడుతుందంటూ బెదిరించాడు. దీంతో నిన్న ఉదయం జిల్లా ఎస్పీకి ఆర్డీవో ఫోన్‌ల్లో ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన వ్యక్తి జిల్లాలోని తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డిగా గుర్తించారు. కామారెడ్డిలో ఎఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఈ పని చేశాడని నిర్ధారించుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.