హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం. ఫంక్షన్ హాల్ గోడ కూలి… నలుగురు మృతి.

0
44

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అంబర్ పేట గోల్నాకలో పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని చికిత్స నిమిత్తం యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు ఆటోలు, 10 బైకులు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ డిజాస్టర్ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. ఫంక్షన్ హాల్‌లో పెళ్లి జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.