మరాఠీ సింగర్ గీతా మాలి మహారాష్ట్రలోని థానేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. గురువారం తెల్లవారుజామున 3గంటలకు ఆమె ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ కంటైనర్‌ను ఢీకొట్టింది.ప్రమాదంలో గీతా మాలి,ఆమె భర్త తీవ్ర గాయాలపాలయ్యారు. ఇద్దరిని హుటాహుటిన సమీపంలోని షాపూర్ రూరల్ ఆస్పత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ గీతా మాలి కన్నుమూశారు. ఆమె భర్త పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. అమెరికా నుంచి తిరిగొచ్చిన ఆమె తన స్వగ్రామం నాసిక్‌కి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.కాగా,గీతా మాలి పలు మరాఠీ సినిమాల్లో పాటలు పాడారు. అలాగే పలు సొంత ఆల్బమ్స్ కూడా రూపొందించారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -