ప్రియాంకరెడ్డి హత్య కేసులో కీలక మలుపు.

0
63

ప్రియాంకరెడ్డి హత్య కేసును పోలీసులు 24 గంటల్లో చేధించారు. నలుగురు లారీ డ్రైవర్,క్లీనర్లు కలిసి ఆమెపై హత్యాచారం చేసినట్టుగా నిర్దారించారు. ఉద్దేశపూర్వకంగానే ప్రియాంక రెడ్డితో టైర్ పంక్చర్ డ్రామా ఆడినట్టు గుర్తించారు. మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి నలుగురు కలిసి గ్యాంగ్ రేప్‌కి

పాల్పడ్డట్టు తేల్చారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆమెపై అత్యాచారం తర్వాత ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. హత్యానంతరం మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి కిరోసిన్ పోసి తగలబెట్టారు. ఆపై మృతదేహాన్ని అండర్ పాస్ వద్దకు తీసుకెళ్లి అక్కడ పడేశారు. మరో నిందితుడు స్కూటీని కూడా అక్కడికే తీసుకొచ్చి పార్క్ చేశాడు.అనంతరం అక్కడినుంచి పారిపోయాడు.ప్రస్తుతం నలుగురు నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. నిందితులను మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వివరాలు వెల్లడించేఅవకాశం ఉంది.