టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ నటిగా గుర్తింపు పొందిన శ్వేతా బసు ప్రసాద్ తన ఫాలోవర్స్‌ను షాక్‌కు గురి చేశారు. గత ఏడాది ఆమె ఫిల్మ్‌మేకర్ రోహిత్ మిత్తల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్వాడీ, బెంగాలీ సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వీరి వివాహ వేడుకను నిర్వహించారు. అయితే తమ వైవాహిక బంధానికి కొన్ని నెలల క్రితం స్వస్తి పలికినట్లు శ్వేతా బసు తాజాగా ప్రకటించారు. ‘నేను, రోహిత్ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కొన్ని నెలలపాటు బాగా ఆలోచించి ఇటీవల ఈ తుది నిర్ణయం తీసుకున్నాం. ప్రతి పుస్తకాన్ని పూర్తిగా చదవలేం. దానర్థం అది చెడు పుస్తకమని కాదు.. దాన్ని మనం చదవలేమని కూడా కాదు. కొన్ని విషయాల్ని పూర్తిగా తెలుసుకోకుండా మధ్యలో వదిలేయడమే మంచిది. మధుర జ్ఞాపకాల్ని మిగిల్చి, నాలో స్ఫూర్తి నింపినందుకు ధన్యవాదాలు రోహిత్.

శ్వేతా బసు ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయమయ్యారు. తర్వాత ‘కాస్కో’, ‘రైడ్’, ‘కళావర్ కింగ్’ తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పలు సినిమాల్లో సందడి చేశారు. గత ఏడాది డిసెంబరు 13న ఆమె తన ప్రియుడు రోహిత్ మిత్తల్‌ను పెళ్లాడారు. సరిగ్గా ఏడాది తర్వాత అతడితో విడిపోయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో నటిస్తున్నారు.