బాహుబలి సినిమాతో హీరోగా ప్రభాస్ క్రేజ్‌తో పాటు ప్రతినాయకుడు భళ్లాల దేవునిగా నటించిన రానాకు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో రానా తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. తాజాగా రానా.. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ‘హాథీ మేరా సాథీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ‘అరణ్య’గా పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హిందీ వెర్షన్ ‘హాథీ మేరా సాథీ’ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. అడవిలో ఏనుగులను మచ్చిక చేసుకోని వాటితో సావాసం చేసే అడవి తెగకి చెందిన వ్యక్తిగా రానా లుక్ ఆకట్టుకునేలా ఉంది. మానవుల స్వార్థం కోసం అడవులను ఆక్రమించడం, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్ధం వలన ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథగా అరణ్య తెరకెక్కింది. ఈ సినిమాలో జోయా హుస్సేన్, శ్రియ పిలగోన్కర్ , విష్ణు విశాల్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కింది. ఈచిత్రాన్ని అన్ని భాషల్లో ఏప్రిల్ 2న విడుదల కానుంది. త్వరలోనే తెలుగు, తమిళ టీజర్‌లను విడుదల చేయనున్నారు.
