గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో అసలు హీరోల లిస్టు నుంచే పక్కకు తప్పుకునే పరిస్థితుల్లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘పీఎస్వీ గరుడ వేగ’ సినిమాతో మరోసారి రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనిపించాడు.హాలీవుడ్ తరహా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాతో హీరోగా రాజశేఖర్..గోడకు కొట్టిన బంతిలా బ్యాక్ బౌన్స్ అయ్యాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఇపుడు చేయబోయే సినిమాల విషయంలో పక్కా ప్లాన్‌తో ఉన్నాడు. ఆ తర్వత 1983 జరిగిన మర్డర్ నేపథ్యంలో ‘కల్కి’ సినిమా చేసాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఈ సినిమాల కంటే ముందు రాజశేఖర్ హీరోగా తెరకెక్కి విడుదల కాకుండా ఆగిపోయిన ‘అర్జున’ సినిమాను ఇపుడు దుమ్ము దులిపి విడుదల చేస్తున్నారు. తమిళ దర్శకుడు కణ్మణి తెరకెక్కించిన ఈ చిత్రం ఎపుడో విడుదల కావాల్సింది. హీరోగా రాజశేఖర్ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిన ఈ సినిమాను విడుదల చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఇక ‘గరుడ వేగ’ ఇచ్చిన సక్సెస్‌తో ఇపుడు ‘అర్జున’ సినిమాను విడుదల చేస్తున్నారు. ‘అర్జున’ సినిమాలో రాజశేఖర్ తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసాడు. ఇప్పటికే సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు.

ఇందులో రాజశేఖర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభియం చేస్తున్నాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే… ఈ చిత్రాన్ని పూర్తి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించినట్టు కనబడుతోంది. ఈ సినిమాలో రాజశేఖర్ వయసు మళ్లిన సూర్యనారాయణ అనే రైతు పాత్రతో పాటు.. పొలిటిషన్ అర్జున గా రెండు పాత్రలో కనిపించనున్నాడు. పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కతున్న మార్చి 6న 800 థియేటర్స్‌లో విడుదలచేయనున్నారు. పెద్దగా హడావుడి ఉండని ఎగ్జామ్స్ సీజన్‌లో విడుదల కాాబోతున్న ‘అర్జున’ సినిమాతో రాజశేఖర్ మరో సక్సెస్ అందుకుంటాడా లేదా చూడాలి.