కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్‌తో మొన్నటి వరకు సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. దీంతో సినిమా షూటింగ్స్‌తో పాటు థియేటర్స్ అన్ని మూతపడ్డాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీటైన సినిమాల నిర్మాతలు సినిమాల కోసం వడ్డీలు కట్టలేక తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు మంచి రేటుకే అమ్ముకుంటున్నాయి. ఇక తెలంగాణ, సహా వివిధ ప్రభుత్వాలు షూటింగ్స్‌కు పర్మిషన్స్ ఇచ్చినా.. థియేటర్స్ ఓపెన్ చేయడానికి మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకో రెండు మూడు నెలల వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగేలా కనిపించింది.దీంతో చాలా మంది చిత్ర నిర్మాతలు తమ సినిమాలను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే జ్యోతిక హీరోయిన్‌గా నటించిన ‘పొన్‌మగల్ వందాల్’ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. అదే బాటలో కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ సినిమా జూన్ 19న విడుదల కాబోతుంది. ఇక బాలీవుడ్‌లో అమితాబ్, ఆయుష్మాన్ గులాబో సితాబో సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది.

తాజాగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘గుంజన్ సక్సెేనా’ ‘ది కార్గిల్ గర్ల్ మూవీ ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. థియేటర్స్ లో విడుదల కాకుండా.. నేరుగా ఓటీటీలో విడుదల కాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘గుంజన్ సక్సెనా’ మూవీ. ఈ చిత్రాన్ని శరణ్ శర్మ డైరెక్ట్ చేసారు. జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి.