ఏపీలో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లాక్‌డౌన్‌కు ముందు బార్లలో మిగిలిపోయిన మద్యాన్ని ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూ స్పెష ల్ సీఎస్ రజత్ భార్గవ సోమవారం ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 8 నుంచి లాక్‌డౌన్ నిబంధనలను చాలా వరకు సడలించినా బార్ అండ్ రెస్టారెంట్లకు ప్రభుత్వం ఆ మినహాయింపు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బార్లలో మిగిలిపోయిన మద్యం పాడయ్యే అవకాశం ఉన్నందున అమ్ముకునేందుకు అనుమతివ్వాలని వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని విన్నవించింది. దీంతో వారి కోరిక మేరకు మద్యం షాపుల ద్వారా అమ్ముకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు రజత్ భార్గవ తెలిపారు. బార్లలో ఉన్న మద్యాన్ని షాపులకు అప్పగించి రశీదు పొందాలని సూచించారు.
