మూడు రోజుల పాటు అన్నం పెట్టలేదు.. బాలికపై సామూహిక అత్యాచారం

0
53

దేశంలో మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. రోజు రోజుకీ వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన ఒడిస్సా రాష్ట్రంలో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. కటక్ రైల్వేస్టేషన్ సమీపంలో అపస్మారక స్థితిలో ఓ బాలిక పడి ఉండడాన్ని గమనించిన డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అంగుల్ జిల్లాకు చెందిన బాలికను కిడ్నాప్ చేసిన కొందరు యువకులు ఆమెను కటక్ తీసుకొచ్చారు.

అక్కడ ఓ గదిలో బంధించి మూడురోజుల పాటు గ్యాంగ్ రేప్ చేశారని విచారణ ద్వారా తెలుసుకున్నారు. మూడు రోజుల పాటు ఏమీ తినకపోవడం ద్వారా స్పృహ తప్పి పడిపోయానని.. ఓ ఆటో డ్రైవర్ సాయంతో.. కటక్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నానని ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.