డియర్ ఇమ్రాన్‌జీ.. మీకు మూడు పెళ్లిళ్లు ఎందుకయ్యాయి.. వర్మ సర్జికల్ స్ట్రైక్స్

0
61

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై భరతజాతి మొత్తం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు కన్నుమూశారు. ఈ దాడికి కారణభూతులైన ఉగ్రవాదులకు రక్షిణ కల్పిస్తున్న పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే, ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుండబద్ధలు కొట్టారు. పైగా, తమపై నిందలు వేయడం సబబు కాదని, యుద్ధానికంటూ దిగితే తాము కూడా యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు

ఈ నేపథ్యంలో పుల్వామా దాడిపై ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేశారు. అంటే.. సర్జికల్ స్ట్రైక్స్‌లా ఆయన ట్వీట్లు ఉన్నాయి. ట్విట్టర్ వేదికగా వర్మ విమర్శల వర్షం కురిపించారు.

వర్మ చేసిన ట్వీట్లు వరుసగా..

1. ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్… సమస్యలు ఒక్కమాటతో పరిష్కారమైతే మీకు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు.

2. ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఒక వ్యక్తి టన్నుల కొద్ది ఆర్‌డీఎక్స్‌తో తమ వైపు పరిగెత్తుకొస్తున్నప్పుడు అతనితో ఎలా చర్చలు జరపాలో మా మొద్దు భారతీయులకు నేర్పించండి.. కావాలంటే మీకు ట్యూషన్ ఫీజు కూడా ఇస్తాము.

3. ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్… ఒసామా బిన్ లాడెన్ వంటి వ్యక్తి మీ దేశంలో ఉన్నాడని ఆమెరికాకు తెలుస్తుంది. కానీ మీకు తెలియదు. మరి మీది అసలు దేశమేనా? చెప్పండి సార్ ఓ మొద్దు భారతీయుడు అడుగుతున్నాడు. మాకు కొంచం తెలివితేటలు నేర్పండి.

4. ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. జేష్-ఏ-మహ్మద్, లష్కర్-ఏ-తొయిబా, తాలిబన్, అల్-ఖయిదా మీ ప్లే స్టేషన్లు అని నాకు ఎవరూ చెప్పలేదు. కానీ మీరు కూడా వాటిపై మీకు ప్రేమ లేదన్న విషయాన్ని అంగీకరించలేదు.

5. ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. జేష్-ఏ-మహ్మద్, లష్కర్-ఏ-తొయిబా, తాలిబన్, అల్-ఖైదాలను మీరు బంతులుగా భావించి.. పాకిస్థాన్ బౌండరీలు దాటిస్తూ.. ఇండియా పెవిలియన్‌లోకి పంపుతున్నారు. కానీ మీరు వాటిని క్రికెట్ బాల్స్ అనుకుంటున్నారా.. లేదా బాంబ్స్ అనుకుంటున్నారా.. కాస్త చెప్పండి సార్… అంటూ ఇమ్రాన్ ఖాన్‌పై రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లతో విరుచుపడ్డారు. అయితే వర్మ చేసిన ఈ ట్వీట్లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవి వర్మ సర్జికల్ స్ట్రైక్స్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.