ఇంటర్మీడియట్ పరీక్షల తేదీ ఖరారు… ముఖ్య సూచనలు

0
74

ఈనెల 27 నుంచి మార్చి 13 వరకు తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలంగాణ విద్యామండలి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల లోపు విద్యార్థులు పరీక్ష కేంద్రం చేరుకోవాలని, 8.45కు సెంటర్ లోపలికి వెళ్లిపోవాలని, ఉదయం 9 గంటలకు ఒక్కనిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించరని అధికారులు చెప్పారు.

కొన్ని ముఖ్యమైన సూచనలు:
* ఆన్‌లైన్‌లో హల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
* ఐపీఈ సెంటర్ లొకేటర్ ఆప్ 2019 ద్వారా సెంటర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు.
* హల్‌టికెట్స్ లేకపోతే ఎక్సామ్ సెంటర్ లోపలికి అనుమతించరు.