స్పిన్నింగ్ మిల్లులో దారుణం.. భార్యను చంపి భర్త పరార్

0
104
Murder
Murder

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం యలమంద గ్రామం వద్ద ఉన్న మిట్టపల్లి స్పీన్నింగ్ మిల్లులో దారుణం జరిగింది. ఓ కిరాతక భర్త కట్టుకున్న భార్యను హత్య చేసిన అక్కడ నుంచి పారిపోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే,

ఒరిస్సా రాష్ట్రం సంబల్పూర్ జిల్లా ధనుపల్లి మండలం బెత్తపట్టి గ్రామంకు చెందిన రాంకిగురు పాటికర్ తన భార్యతో కలిసి రెండు నెలల క్రితం మిట్టపల్లి స్పీన్నింగ్ మిల్లులో పనికి చేరారు. ఈ భార్యాభర్తలు సఖ్యతానే ఉన్నప్పటికీ వారి మధ్య ఏం జరిగిందో ఏమోగానీ.. రాంకిగురు పాటికర్ తన భార్యను అతి కిరాతకంగా హత్య చేసి పారిపోయాడు.

అయితే మిల్లు నుంచి దుర్వాస రావడంతో యాజ‌మాన్యం పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మిల్లును పరిశీలించగా, ఓ పాలిథిన్ క‌వ‌ర్‌లో ఓ మహిళ శవాన్ని గుర్తించారు. పాటిక‌ర్ త‌న భార్య‌ని చంపి సొంతూరుకు పారిపోయివుంటాడని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.