మట్టితో చేసిన గణనాధులను పూజించాలి.

0
76

వినాయక చవితి నాడు మట్టితో చేసిన గణనాధులను పూజకొరకు ఉపయోగించాలని పర్యావరణ పరిరక్షణలోభాగంగా భక్తులు భాగస్వామ్యం కావాలని  జిల్లా కలెక్టరు ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు. పర్యావరణ వినాయక చవితి పేరిట కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన ప్రచార గోడ పత్రాలను నగరంలోని ఉపకలెక్టరు కార్యాలయంలో సోమవారం ఆయన ఆవిష్కరించారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, ఇతర రసాయనాలతో తయారు చేసిన బొమ్మలను వినియోగించవద్దని, పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. కాల్వలు, నదుల పరిశుభ్రతకు, ప్లాస్టిక్‌ నియంత్రణకు జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అందులో బాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినయకులను పెట్టాలని కోరారు.