గుండె పోటుతో ఆర్టీసీ కార్మికుడు మృతి. ఆందోళనలో ఆర్టీసీ డ్రైవర్స్..

0
69

సమ్మెపై ప్రభుత్వ వైఖరితో ఆర్టీసీ కార్మికుడు తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. భవిష్యత్తుపై బెంగతో గుండె పోటుకు గురవుతున్నాడు. ఆదివారం ఇద్దరు ఆర్టీసీ కార్మికులు గుండె పోటుతో చనిపోయారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న షేక్‌ ఖాజామియా 16 రోజులుగా సమ్మెలో పాల్గొంటున్నారు. ఆదివారం ఆయనకు గుండె పోటు వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు తెలిపారు. సమ్మెపై ప్రభుత్వ వైఖరితో ఆయన తీవ్ర మనోవేదన చెందారని, అందుకే గుండె పోటు వచ్చిందని జేఏసీ నాయకులు ఆరోపించారు.