రత్నాలు అమ్మిన చోట.. ఇసుకను కొనుగోలు చేయాల్సి వచ్చిందని సెటైర్లు.

0
59

ఏపీలో ఇసుక రాజకీయం హాట్ హాట్‌గా నడుస్తోంది. ఇసుక కొరతకు జగన్ సర్కారు తీరే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇసుక లేకపోవడంతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని విమర్శిస్తున్నాయి. జగన్ సర్కారు తీరును నిరసిస్తూ.. టీడీపీ నేత నారా లోకేశ్ గుంటూరులో నిరసన దీక్ష చేపట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. నవంబర్ 3న విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నారు. ఇసుక కొరత కారణంగా కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ.. ప్రతిపక్ష నేతలు భగ్గుమంటున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఇసుకను అమ్ముతున్న ఫొటో వైరల్‌గా మారింది. చిన్న ప్లాస్టిక్ డబ్బాలో పోసి ఇసుక అమ్ముతున్న ఫొటోను వైరల్ చేసిన కొందరు.. రత్నాలు అమ్మిన చోట.. ఇసుకను కొనుగోలు చేయాల్సి వచ్చిందని సెటైర్లు వేశారు.