సుకుమార్ దర్శకత్వంలో అనసూయ పాత్ర ఏంటి ?

0
60

తెలుగు టెలివిజన్ తెరపై ‘జబర్దస్త్’ కామెడీ షోతో పాపులర్ అయిన యాంకర్ అనసూయ. ఆ తరువాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ నటిగా తన సత్తా చాటుతోంది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చిన్నా చితక పాత్రల్లో నటించినా అంతగా గుర్తింపు రాని అనసూయ.. నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాతో ఒక్కసారిగా అనసూయకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ సినిమాలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్రకు  ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

అనసూయ.. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న  సినిమాలో  ఈమె కోసం అదిరిపోయే రోల్ సిద్ధం చేశారని. రీసెంట్‌గా అల్లు అర్జున్, సుకుమార్ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.  ‘రంగస్థలం’ లాంటి భారీ హిట్ తర్వాత కొత్త గ్యాప్ తీసుకున్న సుకుమార్.. ముందుగా మహేష్ బాబుతో చేద్దామనుకున్నాడు. ఎందుకో కథ సెట్ కాక.. అల్లు అర్జున్‌తో నెక్ట్స్ సినిమా చేస్తున్నాడు. ‘రంగస్థలం’లో రంగమ్మత్త.. తరహాలోనే  ఈ పాత్రను డిజైన్ చేసినట్టు సమాచారం.