యుద్ధానికి వెళ్లేటప్పుడు కత్తి ఎంత అవసరమో.. బైక్ పై ప్రయాణించెటప్పుడు హెల్మెట్ అంత అవసరం. ప్రస్తుతం రోడ్లపై ప్రయాణం రోజురోజుకు ఎక్కువవుతున్న తరుణంలో ప్రమాదాలు అంతే రీతిలో అధికమవుతున్నాయి. ముఖ్యంగా మనదేశంలో ద్విచక్రవాహనాలపై వెళ్లే వారి సంఖ్యే ఎక్కువ. ఈ కారణంగా హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణించడం అంత క్షేమం కాదు. ప్రస్తుతం కొత్త బైక్ కొంటే హెల్మెట్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. అంతేకాకుండా అందుబాటులోని ధరల్లో హెల్మెట్లు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. తాజాగా ప్రముఖ హెల్మెట్ తయరీదారు సాంధార్ ఆమ్కిన్ ఇండస్ట్రీస్ తన సరికొత్త శిరస్త్రాణాన్ని విడుదల చేసింది. మావోక్స్ హోంచో సిరీస్ హెల్మెట్ ను లాంచ్ చేసింది.

అదిరి పోయే ఫీచర్లను ఈ హెల్మెట్లో పొందుపరించింది. దీని ప్రారంభ ధర రూ.999లుగా నిర్దేశించింది. మూడు వేరియంట్లలో వివిధ కలర్ ఆప్షన్లను వినియోగదారుల ముందుంచింది. మార్చి నుంచి ఈ హెల్మెట్ విక్రయాలను మొదలు పెట్టనుంది.
మావోక్స్ హెంచో సిరీస్ హెల్మెట్ లో సేఫ్టీ ఫీచర్లకు కొదవే లేదు. బ్లూటూత్ సదుపాయం కూడా ఇందులో పొందుపరిచారు. తలపై సౌకర్యవంతంగా పెట్టుకునేలా పైనుంచి నోటి వరకు వెంటిలేషన్ ఉండేలా యాంటీ ఫాగ్ డిజైన్ లో రూపొందించారు. మెరుగైన భద్రతా కోసం లాకబుల్ విజర్స్, నోటి వద్ద మౌత్ గార్డ్, బ్లూటూత్ పెట్టుకునేందుకు అనువైన ప్రత్యేకతలతో ఈ హెల్మెట్ ఆకట్టుకుంటోంది. మౌత్ గార్డ్ తో పాటు రియల్ స్పాయిలర్స్, ప్రీమియం ఎక్సాహాస్ట్ పోర్టులు లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. లైట్ వెయిట్ తో కంఫర్టుబుల్ డిజైన్ తో ఈ శిరస్త్రాణం ఆకట్టుకుంటోంది.