తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్, కేటీఆర్ వంటి రాజకీయనాయకులు కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టీఆర్ఎస్ నేత, హరీశ్ రావు కూడా కేసీఆర్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భం గా ట్విట్టర్ లో హరీశ్ స్పందిస్తూ..”తెలంగాణ మీ స్వప్నం ఈ రాష్ట్రం మీ త్యాగఫలం ఈ అభివృద్ధి మీ ధక్షతకు నిదర్శణం ఈ నేలకు మీరే శ్రీరామ రక్ష తెలంగాణ జాతిపిత శ్రీ కేసిఆర్ గారు శతవసంతాలు చూడాలని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు. కేసిఆర్ గారి పురిటి గడ్డ సిద్ధిపేట లో ఆయన జన్మదినాన్ని ఆకుపచ్చ ఉత్సవంగా జరిపిన ప్రజలకు కృతజ్ఙతలు. ఊరూ వాడ ఏకమై.. మొక్కలు నాటుతూ అభిమానాన్ని చాటినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు.” అంటూ ట్వీట్ చేశారు.