మిరాజ్-2000 : భారత వజ్రాయుధం

0
192

భారత వైమానికదళంలో ఉన్న యుద్ధ విమానాల్లో మిరాజ్ 2000. 1985లో భారత వైమానికదళంలోకి చేర్చారు. ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ ఈ విమానాన్ని తయారు చేసింది. ఈ యుద్ధ విమానాలకు భారత వాయుసేన వజ్ర (వజ్రాయుధం) గా పేరు పెట్టింది. 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించడంలో మిరాజ్‌ యుద్ధ విమానాలే కీలక పాత్ర పోషించాయి. మిరాజ్‌ 2000 యుద్ధ విమానంలో పలు రకాలు ఉన్నా.. భారత్‌ వద్ద మాత్రం 42 మిరాజ్‌-2000హెచ్‌, ఎనిమిది 2000టీహెచ్‌ యుద్ధ విమానాలున్నాయి. మిరాజ్‌-2000లో సింగిల్‌ ఫైలట్‌, డబుల్‌ ఫైలట్‌ వెర్షన్లు ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు చాలా చిన్నవిగా అంటే పొట్టిగా ఉంటాయి. వీటి బరువు 7.5 టన్నులు. గంటకు 2,336 కిలోమీటర్ల వేగంతో దూసుకెళతాయి. 17 కిలోమీటర్ల పైనుంచి దాడి చేయగలదు. లేజర్‌ గైడెడ్‌ బాంబులను మోసుకెళ్లే సామర్థ్యం వీటి ప్రత్యేకత. గనతలం నుంచి గగనతలంలోకి.. గగన తలం నుంచి భూమిపైనా దాడి చేయగల సత్తా ఉన్న యుద్ధ విమానాలు. డిజిటల్‌ వెపన్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌ వీటిలో అమర్చివుంది. పగలు, రాత్రి లేజర్‌ గైడెడ్‌ ఆయుధాలతో దాడి చేయొచ్చు. ఇంధన సామర్థ్యం 8వేల లీటర్లు. ఒకసారి నింపితే 1,550 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. 14.36 మీటర్ల పొడవు, 5.20 మీటర్ల ఎత్తు ఉంటుంది. 17 వేల కిలోల బరువు మోయగలదు. ఆర్డీఐ రాడార్‌ సెన్సార్‌ వ్యవస్థ, ఆర్‌డబ్ల్యూఆర్‌ సాంకేతికతతో గురి తప్పకుండా లక్ష్యంపై దాడి చేయగలదు. 3 దశాబ్దాల క్రితం భారత వాయుసేనలో చేరిన ఈ విమానాలను ఇటీవలే రూ.20వేల కోట్లు వెచ్చించి ఆధునీకరించారు. అమెరికా నుంచి ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్‌లను పాక్‌ కొనుగోలు చేయడంతో ఫ్రాన్స్‌ వద్ద భారత్‌ వీటిని కొనుగోలు చేసింది. ప్రస్తుతం 50 మిరాజ్‌లు ఉన్నాయి. మిరాజ్‌ 2000 యుద్ధ విమానం ఎంత ఎత్తులో ఉన్నా.. అనుకున్న లక్ష్యాన్ని చేరుతుంది. గురి తప్పదు. అందుకే తాజాగా పాక్‌లోని ఉగ్రస్థావరాలపై దాడికి వాయుసేన వీటిని ఎంపిక చేసింది.